TPCC Chief Mahesh Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు అని మండిపడ్డారు.
Minister Tummala: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం.
డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్,హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి,చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా…
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి.
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్లో 2017లో- MRDCL సమావేశాల్లో చర్చించిన అంశాలు, 2018 – ప్రాజెక్ట్ చర్చల ప్రారంభం, MRDCL అధికారులతో 09.07.2018న సమావేశం నిర్వహించినట్లు పేర్కొంది. నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలను లెక్కించాలని నిర్ణయించారని, బఫర్ జోన్ 1 నెల వ్యవధిలో నది సరిహద్దును సక్రమంగా ఫిక్సింగ్ చేస్తుందని తెలిపారు. పునరావాసం, భూమి కోసం ఒక నివేదిక తయారు…
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన వెల్లడించారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు…
కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆందోళనను వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోందని, “గ్యారంటీ” అనే పేరుతో ప్రజలను మోసపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో ఓట్లు వేసుకుని గెలిచాక, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక కారణాలు చెప్పి, నిర్లక్ష్యంగా చుక్కలు చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఈ గ్యారంటీలను అమలు చేయడం కాకుండా, “హైడ్రా” అనే పేరుతో ఇతర అంశాలకు దృష్టి…