బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు.
KTR : హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయి, ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన భూములను కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో, “రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు హక్కుగా రావాల్సిన ఇంటి…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి అని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి చీట్చాట్ నిర్వహించారు. బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.. బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను.పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..?
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి…