Minister Seethakka: యూరియా కొరత పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై ధర్నా చేయిస్తున్నారని విమర్శించారు. నేడు కామారెడ్డిలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే…
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
KTR Slams Congress Over Rythu Bima Renewal Rules: ‘రైతు బీమా’ పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024-25 బీమా గడువు ఆగష్టు 13తో ముగుస్తుండగా.. 2025-26కి ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. రైతు బీమా పథకంలో చేరే రైతులు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. రైతులు తమతో పాటు నామినీకి చెందిన ఆధార్ కార్డు, పట్టా పుస్తకం దరఖాస్తుకు జతచేసి స్వయంగా…
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన తాజా నివేదికను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను “గాలికి వదిలేసి” రాజకీయ కక్షలు సాధించేందుకే కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు దంచుకోవడానికీ, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికీ ఈ కమిషన్లు సాధనంగా మారాయని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, “పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్, బీఆర్ఎస్ రాజతోత్సవ సభ ముందు ఒక రిపోర్ట్,…
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదు.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. Also Read:US:…
దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. Also Read:Extra Marital…
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా…