MLC Kavitha : తెలంగాణలో పలు ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద యూరియా కోసం రైతులు తడిసిమోసిన జల్లులా క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
ఆదివారం ఆమె ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ, “ఇది నో స్టాక్ సర్కార్. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా ఉన్న రైతు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ రోడ్డు మీద పడిపోయాడు,” అంటూ వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత తీరక.. పోలీస్ స్టేషన్లలోనే వాటిని అమ్మిన దశకి ప్రభుత్వం చేరుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూరియాతోపాటు డీఏపీ, పొటాష్ వంటి ముఖ్యమైన ఎరువుల కోసం కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అక్కడి రైతుల దుస్థితి ఇంకా దారుణంగా ఉందని విమర్శించారు.
వానాకాలం సీజన్ ప్రారంభమై నెలవుతున్నా సరైన ప్రణాళిక లేక, ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే రైతులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించే వారిని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆమె హెచ్చరించారు.
Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్ టార్గెట్ అదే.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!