Minister Seethakka : బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం ములుగు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనిపై తప్పుడు ప్రచారం చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగితే కేటీఆర్ నాశనం తప్పదని హెచ్చరించారు. ” మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె పరిస్థితిని గమనించు కేటీఆర్!” అంటూ ఆమె ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాల నుంచి బయటపడాలని హితవు పలికిన సీతక్క, “నువ్వు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖకు నేను మంత్రిగా వచ్చిన తరువాత భయపడుతున్నావ్. నేను ఎలాంటి కుల, కుటుంబ, అధికార పటిష్టత లేకుండా ప్రజల మద్దతుతో నిలబడ్డాను,” అని వ్యాఖ్యానించారు. తన అన్న కూడా ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయారని, తాను ఎవరినీ అండగా లేకుండానే పోరాటం చేసి ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
SSMB 29 : సైలెన్స్‌ను కూడా ప్రమోషన్స్ స్ట్రాటజీగా వాడేస్తున్న జక్కన్న.
ఇక ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. “పక్క నియోజకవర్గాల్లో ఓడిపోయాక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని” స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని అన్నారు. లక్ష్మీదేవిపేట, చల్వాయి గ్రామాల్లో యువకులపై పెట్టిన కేసులను గుర్తు చేస్తూ, “వాస్తవంగా నువ్వు ధైర్యవంతుడివైతే చర్చకు సిద్ధమవ్వు” అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి, “పదేళ్లలో కనీసం వేయి ఇండ్లయినా ములుగులో నిర్మించారా? ఇప్పుడేమి మాట్లాడతారు?” అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న కేటీఆర్‌కు సంస్కారం లేదని, ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుందో ములుగులో తాము చూపిస్తున్నామని అన్నారు.
Rammohan Naidu: జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులకు అనేక చిక్కుముడులు..!