KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం…
KTR : హైదరాబాద్ నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో నగరం సౌభాగ్యంగా ఎదిగిందని, కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభాగ్యంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటలయుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండని, లగచర్లలో జరిగిందంటున్నారు.. మరి ఆనాడు మల్లన్నసాగర్‌లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొండపోచమ్మ…
Supreme Court : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో, కోర్టు మరోసారి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో శనివారం మధ్యాహ్నం ఉత్కంఠభరితమైన చర్చ చోటుచేసుకుంది. రైతు సమస్యలు, రుణమాఫీ, వడ్ల బోనస్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ – “నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. నా నియోజకవర్గంలో నేను తిరిగిన…
BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి, ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం…
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించనున్నారు.
Vemula Prashanth Reddy : తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేసి, 14 ఏళ్లు మడమ తిప్పని ఉద్యమం నడిపిన వ్యక్తి అని ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తగదని మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు.…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తూ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మొత్తం 39 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తీరు “గల్లీలో హోదా మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు” అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి…