దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారన్నారు.
ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మంచి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉంటే మంచిగా ఉంటుందని.. బేకార్ గాళ్ల చేతుల్లో పడితే ఆగం అవుతుందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు.
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనమొనిగూడతండా, నామ్యతండా, బిల్డింగ్ తండా, హేమాజిపూర్, తిమ్మారెడ్డిపల్లి, నేలబండతండా, పొలిమేరబండతండా తదితర గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.
2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేది అని నిర్మలా సీతారామన్ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిండు.. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్.. కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార హోరును పెంచింది. ఖమ్మం నగరం మామిల్లగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు.
అంబర్పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు.