ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది… మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు. అంటే కమ్యూనిస్టుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డట్లు తెలుస్తోంది.. ఖమ్మం జిల్లా సెక్యులర్ జిల్లా.. ముస్లీంల ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయి.. ఈ ఓటమికి మనవాళ్ల పాత్ర ఏంటి, ప్రత్యర్థుల పాత్ర ఏంటి అనేది సమీక్షించుకోవాలి అని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.
Read Also: Lashkar Terrorist Shot Dead: 2015 ఉధంపూర్ దాడి ప్రధాన సూత్రధారి పాకిస్థాన్‌లో హతం
ఘోర ఓటమి అయితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 శాతం ఓట్ల తోనే ఒడిపోయామని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేవలం అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చింది.. ఆ హామీల అమలుకు ఖర్చు నెలకెంత, సంవత్సరానికి ఎంత, సాధ్యాసాధ్యాలపై మనం చూడాల్సిన అవసరం ఉంది.. ఇన్నాళ్లు కాంప్ కార్యాలయాల దగ్గర ప్రజల కోసం పనిచేసామని ఆయన తెలిపారు. నేను ఫలితాల రోజు ఇక్కడే ఉన్నా.. అక్కడ కాంగ్రెస్ వాళ్లు క్యాంప్ ఆఫీసు తాళాలు అడిగారట.. నేను ఏ రోజు అలాంటి పనులు చేయలేదు అని వీరయ్య చెప్పుకొచ్చారు. ఇపుడు పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి ప్రజల కోసం నిలబడదాం.. మేమంతా ప్రజల కోసం ఎల్లపుడు అందుబాటులో ఉంటామని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పుకొచ్చారు.