KCR Health News: ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారి పడిన కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలి ఎముక విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎముకను మార్చారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వాకర్ సాయంతో కేసీఆర్ ను డాక్టర్లు నడిపించారు. ఫిజికల్ గా.. మెంటల్ గా కేసీఆర్ స్ట్రాంగ్ గా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం మెరుగు పడిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని అన్నారు.
మరోవైపు ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక, కాలికి ఆపరేషన్ అయ్యాక.. కేసీఆర్ నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు కేసీఆర్ వద్దే ఉండి వాకర్ సాయంతో మార్గనిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నటుడు ప్రకాష్‌రాజ్ స్పందించారు. కేసీఆర్‌ను మైక్ రాక్‌స్టార్ అని వ్యాఖ్యానిస్తూ, వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాగా, ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Read also: Marital Rape: భార్యకు 18ఏళ్లు పైబడితే.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం
నిన్న (శుక్రవారం) సాయంత్రం కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మెడికేషన్ కొనసాగుతోంది.. వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ ఫాలో అవుతున్నారు అని పేర్కొన్నారు. ఆయన కొంత కోలుకున్న తర్వాత నడిపించే ప్రయత్నం చేసారు.. ఫిజియథెరపీ కూడా నిర్వహించారు.. ఇంకా రెండు మూడు రోజుల వరకు ఆస్పత్రి లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు.. రికవరీకి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు సమయం పడుతుందని అన్నారు. సీనియర్ సిటిజన్ కావడంతో సాధారణ స్థితిలోకి వచ్చి నడిచేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది అని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Allu Arjun: ఓ పుష్ప రాజ్ అన్నా… ఆయన అందరినీ ఎందుకు కలుస్తున్నాడో నువ్వైనా కనుక్కో కాస్త