Karimnagar: రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసిన సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులలోనే విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని కొనసాగింపు నిర్ణయం, మహిళలకి అర్థిక వెసులు బాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.. ఉచిత ప్రయాణంపై విద్యార్థిలకి, మహిళ ఉద్యోగులకి లబ్ది చేకూరింది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలనడం హర్షనీయం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?
ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఆదాయశాఖగా మారింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మద్యాన్ని అదాయ మార్గంగా ఎంచుకొని ప్రజలను మద్యానికి బానిసగా చేసింది.. ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉండేవి.. బెల్ట్ షాపుల మూసి వేయటానికి తక్షణమే అదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కౌలు రైతుని గుర్తించడం కష్టమే.. ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో వణుకు పుడుతుంది అని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చిందని దళితులు గ్రహించారు.. ఈసారి ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు.. ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మీతో పాటుగా తులం బంగారం ఇవ్వడం సాధ్యమేనని జీవన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: BRS Leaders: ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుంది.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులు
హుస్నాబాద్ ని సిద్దిపేటలో కలపడం మూర్ఖత్వం చర్య అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ ని తిరిగి కరీంనగర్ లో కలపాలన్న డిమాండ్ పరిష్కారం అవుతుంది.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండనుంది.. అనుమతులు లేకుండా గ్రామాలలో అక్రమంగా నిర్వహించబడుతున్న బెల్ట్ షాపులని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.