BRS Meeting: తెలంగాణ భవన్‌లో ముగిసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీకి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం గెలుపొందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లార్ రెడ్డి, అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొత్తం 119 స్థానాల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. అలాగే ఆరుగురు మంత్రుల ఓటమి, అభివృద్ధి జరిగినా కొన్ని చోట్ల అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనే అంశంపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోయినా మంత్రి మల్లారెడ్డి మరోసారి విజయం సాధించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఈసారి తోటకూరు వజ్రేష్ యాదవ్ పై మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రముఖ విద్యాసంస్థ అధినేతగా 2014లో టీడీపీ తరపున తొలిసారిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. 2014లో ఎంపీ అయిన ఆయన.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి బదులు మల్లార్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. మల్లారెడ్డి విజయం తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు.
Revanth Reddy: ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్..! ప్రస్థానం మామూలుగా లేదుగా..