టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు. 25 ఓవర్లలోనే భారత్ 200 పరుగులు చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా అత్యంత వేగంగా 200 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో.. భారత్ ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే... వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు…
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. శనివారం టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పూరన్ నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ బార్బడోస్ రాయల్స్‌పై 15 బంతుల్లో 27 పరుగులు చేయడంతో.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2059 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు బిగ్ ఫైట్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మ్యాచ్ కు హైలెట్ అంటే దినేష్ కార్తీక్ అని చెప్పాలి. దాదాపు మ్యాచ్ గెలిచినంత దగ్గరగా తీసుకొచ్చాడు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 రోజుల తర్వాత తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద స్కోరును సాధించింది. కాగా.. దానిని SRH స్వయంగా బ్రేక్ చేసింది. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు విధ్వంసంగా ఆడారు. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్…
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు ముంబై గెలిచిన మ్యాచ్ల్లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 3,882 పరుగులు చేశారు. నిన్నటి మ్యాచ్ లో (38) పరుగులు చేయడంతో.. ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3,876)ని అధిగమించారు. ఇదిలా ఉంటే.. అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్ (3,945)…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. రన్ మిషన్, కింగ్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్ లో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్…
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.