రద్దీగా ఉండే రోడ్డుపైనే వాహనాలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారి భూమి బద్దలైంది. దీంతో అక్కడున్న వాహనాలు గాల్లోకి ఎగిరాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.