వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. శనివారం టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పూరన్ నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ బార్బడోస్ రాయల్స్‌పై 15 బంతుల్లో 27 పరుగులు చేయడంతో.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2059 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ను బ్రేక్ చేశాడు వదిలిపెట్టాడు. 2021లో రిజ్వాన్ 2036 పరుగులు చేశాడు.
Read Also: Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ 2024లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వివిధ ఫ్రాంచైజీల్లో కూడా దూకుడు ఇన్నింగ్స్ ప్రదర్శిస్తున్నాడు. డర్బన్ సూపర్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్, MI ఎమిరేట్స్, MI న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, వెస్టిండీస్ వంటి వివిధ జట్ల తరుఫున పూరన్ ఆడుతున్నాడు. పూరన్ టీ20 ఇంటర్నేషనల్, ఫ్రాంచైజ్ లీగ్, దేశీయ టీ20 మ్యాచ్‌లలో 2059 పరుగులు చేశాడు.
Read Also: Steroids : మెడికల్ షాప్ ముసుగులో స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ముఠా
మహ్మద్ రిజ్వాన్ 2021లో 45 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పూరన్ ఈ రికార్డును 65 ఇన్నింగ్స్‌ల్లో పూర్తి చేశాడు. 2024 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. 2024లో అతని స్ట్రైక్ రేట్ 160.63. రిజ్వాన్ స్ట్రైక్ రేట్132.03 ఉండేది. పూరన్ టీ20లో 1,000 పరుగులు పూర్తి చేయడం ఇది మూడో సంవత్సరం, గతంలో 2019, 2023లో పూర్తి చేశాడు.
T20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు:
నికోలస్ పూరన్ – 65 ఇన్నింగ్స్‌లలో 2,059 పరుగులు (2024)
మహ్మద్ రిజ్వాన్ – 45 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు (2021)
అలెక్స్ హేల్స్ – 61 ఇన్నింగ్స్‌లలో 1,946 పరుగులు (2022)
జోస్ బట్లర్ – 55 ఇన్నింగ్స్‌లలో 1,833 పరుగులు (2023)
మహ్మద్ రిజ్వాన్ – 44 ఇన్నింగ్స్‌లలో 1,817 పరుగులు (2022)