ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు ముంబై గెలిచిన మ్యాచ్ల్లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 3,882 పరుగులు చేశారు. నిన్నటి మ్యాచ్ లో (38) పరుగులు చేయడంతో.. ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3,876)ని అధిగమించారు. ఇదిలా ఉంటే.. అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్ (3,945) ఉన్నారు.
Read Also: Pakistan: పేదరికంతో తిండి పెట్టలేక.. భార్య, ఏడుగురు పిల్లల్ని నరికి చంపిన వ్యక్తి..
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. నిన్న గెలిచిన మ్యాచ్తో కలిపి ముంబై.. ఆడిన 5 మ్యాచ్ల్లో వరుసగా రెండింటిలో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తర్వాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో జరుగనుంది.
Read Also: Manjummel Boys: లవ్ లెటర్ టు మంజుమ్మల్ బాయ్స్
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంలో తన పేరు మీద మరో రికార్డు సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో 100 టీ20 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా ‘హిట్‌మ్యాన్’ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2024లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ ఘనత సాధించింది.