టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. రన్ మిషన్, కింగ్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్ లో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్సింగ్స్ ల్లో 93.71 సగటుతో 657 పరుగులు చేశాడు.
Garry Kasparov: చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన రష్యా..
ఇక.. ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే.. ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ స్పిన్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4 పడగొట్టారు. రవీంద్ర జడేజాకే ఒక వికెట్ దక్కింది. ఇక.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. డకెట్ (27), పోప్ (11), రూట్ (26), బెయిర్‌స్టో (29), స్టోక్స్ డకౌట్, ఫోక్స్ (24), హార్ట్లీ (6), షోయబ్ బషీర్ (11), వుడ్ డకౌట్, ఆండర్సన్ డకౌటయ్యారు. ఇక.. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (25), రోహిత్ శర్మ (22) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Suhas : రెమ్యూనరేషన్ ను పెంచడం పై సుహాస్ షాకింగ్ కామెంట్స్..
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్లు వీరే..
యశస్వి జైస్వాల్- 9 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు (భారత్లో 2023-24)
విరాట్ కోహ్లి 8 ఇన్నింగ్స్‌ల్లో 655 (భారత్లో 2016-17)
రాహుల్ ద్రవిడ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 602 (ఇంగ్లండ్‌లో 2002)
విరాట్ కోహ్లి 10 ఇన్నింగ్స్‌ల్లో 593 (ఇంగ్లండ్‌లో 2018)
విజయ్ మంజ్రేకర్ 8 ఇన్నింగ్స్‌ల్లో 586 (భారత్లో 1961-62)