సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 రోజుల తర్వాత తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద స్కోరును సాధించింది. కాగా.. దానిని SRH స్వయంగా బ్రేక్ చేసింది. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు విధ్వంసంగా ఆడారు. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించారు. హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులతో సాలిడ్ ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Rice size: సంగారెడ్డి జిల్లాలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
చివరి ఓవర్లలో.. ఆడమ్ మర్క్రామ్ కూడా 17 బంతుల్లో 32 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే.. ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి ఆడమ్ గిల్‌క్రిస్ట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా హెడ్ నిలిచాడు. 2008లో గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Read Also: ART Cinemas: పూజా కార్యక్రమాలతో మొదలైన ఏషియన్ రవితేజ సినిమాస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డు.. 2013లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించిన క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆ తర్వాత యూసుఫ్ పఠాన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆర్సీబీపై డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీ సాధించాడు.