పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే అందరికీ గౌరంగా ఉంటుంది.. పిల్ల నచ్చిందని చెప్పి.. కట్నానికి ఓకే చెప్పి.. అందరినీ ఆహ్వాన పత్రికలు పంపించి.. తీరా పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో.. డ్రామా చేస్తే ఎవరికైనా మండిపోద్ది.. మరీ ముఖ్యంగా వధువు తరపు వారైతే ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం.. ఎందుకంటే.. పెళ్లి ఒకసారి ఆగిందంటే.. ఏం జరిగిందో..? అనే తప్పుడు ప్రచారం చేసే వాళ్లు వారి పక్కనే కాసుకు కూర్చుంటారు కాబట్టి.. అయితే, జగిత్యాల జిల్లా…
ఓవైపు వరదలు ముంచెత్తుతున్నాయి.. మరోవైపు పెళ్లి ముహూర్తం ముంచుకొస్తుంది.. రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి లేదు.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే.. గోదావరి వదర భయపెడుతోంది.. ఆ సమయంలో.. పెళ్లి కూతురుకు, ఆమె బంధువులకు పడవే ఆధారంగా మారింది.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో పెళ్లి కూతురిని పడవలో తీసుకెళ్లారు బంధువులు.. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయని భావించిన రెండు కుటుంబాలు.. ముందుగానే అంటే జులై నెలలో ముహూర్తం పెట్టుకున్నారు..…
పీటల మీదే పెళ్లి ఆగిపోయే దృశ్యాల్ని మనం నిన్నటివరకు సినిమాల్లోనే చూశాం.. ఇప్పుడు అలాంటి సంఘటనలు రియల్ లైఫ్‌లోనూ చోటు చేసుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చెప్తూ.. స్వయంగా వధువులే పెళ్లిళ్లను ఆపేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. ఏడు అడుగుల్లో భాగంగా రెండు అడుగులు పూర్తయ్యాక.. ‘నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు’ అంటూ వధువు పెద్ద షాకిచ్చింది. ఎంత చెప్పినా వధువు వినకపోవడంతో.. వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు…
ప్రస్తుత తరం యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాపై.. మరీ ముఖ్యంగా గూగుల్‌పై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే! ఏ సమాచారం కావాలన్నా సరే, గూగుల్‌లో శోధిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశోధకులు రకరకాల అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరు, ఏయే అంశాల్ని ఎక్కువ శోధిస్తున్నారన్న విషయాలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారన్న విషయంపై అధ్యయనం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తతో ఎలా ఉండాలన్న దగ్గర నుంచి…
ఎంతకీ పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వెరైటీగా ఐడియా వేశాడు.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి ఊరంతా అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
పెళ్లైన ఆనందంలో వధూవరులు వేదికపై డ్యాన్సులు చేస్తుంటారు. ముఖ్యంగా.. అబ్బాయిలైతే ఇరగబడి రెచ్చిపోతుంటారు. రకరకాల స్టంట్స్ చేసి, తమ భార్యల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటుంటాయి. ప్యాంట్ జారిపోవడం, ఉత్సాహంలో వరుడు కింద పడిపోవడమో.. ఇంకా చిత్రవిచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటిదే మరో ఫన్నీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ముందు స్టంట్ చేయబోయిన ఓ వరుడు.. పొరపాటున భార్యని తన్నేశాడు. ఈ ఘటన విదేశాల్లో…
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలి పోయిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పీఎం పాలెం సీఐ రవి కుమార్.. గుర్తు తెలియని విష పదార్థాన్ని సేవించడం వల్ల సృజన మరణించినట్టు చికిత్స చేసిన…
విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో మెడలో తాళి పడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో పెళ్లి పీటలపైనే ఓ వధువు ప్రాణాలు కోల్పోయింది. నగరం పాలెంలో బుధవారం రాత్రి 7 గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలైంది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. Vangalapudi Anitha: అత్యాచారాలకు కామానేనా? ఫుల్స్టాప్ పడేది ఎప్పుడు? సృజన…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలలా ఏమి జరుగుతున్నా క్షణాల్లోనే తెలిసిపోతుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు వివిధ రకాలుగా జరుగుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి అని అర్థం ఉంది. పెళ్లికి ముందు చాలా ప్రాంతాల్లో బరాత్ జరుగుతుంది. ఈ బరాత్‌లో నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తుంటారు. డుగ్గుడుగ్గు బెల్లెట్టు బండి సాంగ్ లో వధువు వేసిన డ్యాన్స్ అప్పట్లో ఇంటర్నెట్లో సంచలంగా మారింది. తాజాగా ఓ నూతన వధువు బాంగ్రా డ్యాన్స్‌ను తనదైన…