కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు అత్త గారింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శాడిస్ట్ భర్తతో వేధింపులు మొదలయ్యాయి. ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు అనుక్షణం అవమానాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త విచక్షణ మరచి నువ్వు అందంగా లేవు. నాకు పరిచయం ఉన్న సాయి అనే అమ్మాయి అందం ముందు నీవెందుకు పనికిరావు అంటూ కొట్టి దూషించడం, అడ్డు చెప్పాల్సిన అత్తామామ అతనికి అండగా నిలబడటం చూసి తట్టుకోలేకపోయింది.
చెన్నైలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం 6 గంటలకు మాధవరం బర్మా కాలనీ ప్రాంతానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తికి పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనకు బెసెంట్ నగర్ చర్చిలో వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కొత్త జంట ఇంటికి వచ్చింది.. అయితే, సాయంత్రం జరగనున్న రిసెప్షన్ కోసం తాను బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన అర్చన.. ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు..
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి.
ఇద్దరి ఇష్టాలతో జరిగితేనే ఆ పెళ్లికి ఓ అర్థం. ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వారి దాంపత్య జీవితం నిత్య నరకమే. అందుకే అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే ముందుకు సాగుతుంటారు పెద్దలు. ఇదే విధంగా ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇక్కడే…
పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం పీడకలగా మారిపోతోంది. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోవడం, ప్రాణాలు తీసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఓ నవవధువు పెళ్లై నెల రోజులు తిరగకముందే ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు అత్తారింట్లో భర్త, పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని ఆశపడిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన హాజీపూర్ మండలం…
పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక నూతన దంపతులు రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు.. అత్తింటిలో అడుగుపెట్టిన దగ్గర అందరినీ మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజు సాయంత్రం అందరికీ టీ అందించింది. కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు.
మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10…
హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది..