పెళైన కాసేపటికే పెళ్ళి కొడుకును వదిలేసి ప్రియుడితో పరారైంది ఓ నవ వధువు. హైదరాబాద్ బాలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్ ఇలియాస్‌కు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సమ్రిన్ బేగంతో ఇంట్లో పెళ్లి జరిగింది. అయితే, పెళ్లి సమయంలో రెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 50 వేల రూపాయల నగదు ఇచ్చాడు పెళ్లి కొడుకు ఇలియాస్. అయితే పెళ్లైన కొద్ది సేపటికే పెళ్లి కూరుతు సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకెళ్తామన్నారు…
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది. పెళ్లి తంతు జరిగే సమయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు తెలియకుండా వివాహం జరిగే సమయంతో తప్పులు చేస్తుంటారు. ఇలానే పెళ్లి కొడుకు పెళ్లిపీటలపై ఉండగానే తప్పుచేశాడు. అంతే, ఆ వధువుకు ఎక్కడాలేని కోపం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి వేడుకను చూస్తున్నవ్యక్తులు ఏమీ మాట్లడలేదు. ఇంతకీ ఆ…
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి…
కొన్ని కొన్ని వీడియోలు ఎలా వైరల్ అవుతాయో తెలియదు. వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పుషప్స్ అనేవి ఎక్సర్‌సైజ్‌లో ఒకభాగం. అవి చేసే ముందు ట్రాక్ సూట్ వేసుకొని చేస్తుంటారు. అయితే, ఓ కొత్త పెళ్లికూతురు లెహంగా వేసుకొని పుషప్స్ చేసింది. వివాహం సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అలా చేసినట్టు తెలుస్తోంది. లెహంగాలో కొత్త పెళ్లి కూతురు చేసిన పుషప్స్ కి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్…
ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. అలాగని చేసుకోరని చెప్పలేము. కొన్ని కారణాల వలన విడిపోవచ్చు… తిరిగి కలుసుకోవచ్చు. ఎప్పుడో 2016లో యునితా రురీ అనే యువతిని అక్బర్ కొరిక్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమయిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, అక్బర్ కొరిక్ కు ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన నూర్ ఖుస్నాల్ తో వివాహం నిశ్చయమైంది. ఈ…
పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు. పెళ్లితరువాత బరువు బాధ్యతలు తప్పకుండా పెరుగుతాయి. వద్దు అనుకున్నా మోయాల్సి వస్తుంది. పెళ్లి తరువాత ఓ యువకుడు తన భార్యను భుజాన మోసుకుంటూ తీసుకెళ్లాడు. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో నదిని దాటాల్సి వచ్చింది. అయితే, భారీ వర్షాలు కురవడంతో నదిలో ఇసుక మేటలు వేసింది. దీంతో కొత్త జంట ప్రయాణం చేస్తున్న పడవ మధ్యలోనే ఆగిపోయింది. Read: డైలీ సీరియల్ కి 21…
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఘనంగా చేస్తాం, పెళ్లికోసం 40వేల డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికూతురు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంది. బడ్జెట్ వేసుకుంది. అయితే, చివరకు తల్లి వచ్చి బడ్జెన్ ను 20 వేలకు తగ్గించడంతో యువతి తల్లిదండ్రులపై అగ్గిమీద గుగ్గిలం అయింది. పెళ్లికి కనీసం 25వేల డాలర్లు ఖర్చు చేయాలని లేదంటే ప్రేమించిన యువకుడితో లేచిపోతానని బెదిరించింది. తల్లిదండ్రులే 40వేల డాలర్లు ఖర్చు…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లికి సిద్దమయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైనపుడు కూడా ఎవరికి చెప్పలేదు. పెళ్లి సమయంలో ఆ యువతి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది. పెళ్లిపీటలమీద నుంచి కూడా యువతి చాటింగ్ చేయడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా కనిపించిన యువకుడిని పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి…
సరిగ్గా తాళి కట్టాల్సిన సమయంలో పెళ్లిపీఠల పై నుంచి పరారయ్యాడు ఓ యువకుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పలేక.. తాళి కట్టే వరకు తెచ్చుకున్న అతగాడు.. చివరి సమయంలో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ నిబంధనల మధ్య గ్రాండ్‌కు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెద్దలు.. అంతా హడావుడి.. వధూవరుల తరఫు బంధువులు వచ్చేశారు.. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు…
రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …