Married Women: కొత్తగా పెళ్లి.. గూగుల్‌లో ఆ పని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత తరం యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాపై.. మరీ ముఖ్యంగా గూగుల్‌పై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే! ఏ సమాచారం కావాలన్నా సరే, గూగుల్‌లో శోధిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశోధకులు రకరకాల అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరు, ఏయే అంశాల్ని ఎక్కువ శోధిస్తున్నారన్న విషయాలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారన్న విషయంపై అధ్యయనం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తతో ఎలా ఉండాలన్న దగ్గర నుంచి అత్తమామలతో ఎలా వ్యవహరించాలన్న విషయాలపై సెర్చ్ చేస్తున్నట్టు తేలింది.
మొదటగా భర్తకు ఆకర్షణీయంగా కనిపించాలంటే, ఎలాంటి చిట్కాలు పాటించాలన్న దానిపై ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా.. భర్త ఏ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు? వాళ్లకు ఏది ఇష్టం, ఏది అయిష్టం? ఎలా భర్తల మనసుల్ని గెలుచుకోవాలి? వంటి వాటిని తెలుసుకోవడం కోసమే ఎక్కువ సేపు గూగుల్‌పై గడుపుతున్నట్టు వెల్లడైంది. అలాగే.. అత్తారింట్లో ఉండే సభ్యులందరి మెప్పు పొందేందుకు ఏయే పనులు చేయాలి? ఎలాంటి వంటకాలు వండాలి? అనేది వెతుకుతున్నారట! చివరగా.. కుటుంబ బాధ్యతలు ఎలా చూసుకోవాలి? అందుకు ఎలా నడుచుకోవాలన్న దానిపై గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్టు అధ్యనాల ద్వారా తేల్చారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ఒకప్పుడు ఇంత సాంకేతికత ఉండేది కాదు. కాబట్టి.. కుటుంబ సభ్యులే అన్నీ నేర్పించి అత్తారింటికి పంపించేవారు. కానీ, ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. టెక్నికల్‌గా చాలా అభివృద్ధి చెందింది. అందరూ తమతమ జీవితాల్లో బిజీ అయిపోయారు. ప్రతీదాని కోసం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. కుటుంబ సభ్యుల కంటే ఇంటర్నెట్‌తోనే అందరూ ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. అందుకే, కాపురం ఎలా చేయాలో కూడా గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!