పెళ్లైన ఆనందంలో వధూవరులు వేదికపై డ్యాన్సులు చేస్తుంటారు. ముఖ్యంగా.. అబ్బాయిలైతే ఇరగబడి రెచ్చిపోతుంటారు. రకరకాల స్టంట్స్ చేసి, తమ భార్యల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటుంటాయి. ప్యాంట్ జారిపోవడం, ఉత్సాహంలో వరుడు కింద పడిపోవడమో.. ఇంకా చిత్రవిచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటిదే మరో ఫన్నీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ముందు స్టంట్ చేయబోయిన ఓ వరుడు.. పొరపాటున భార్యని తన్నేశాడు. ఈ ఘటన విదేశాల్లో చోటు చేసుకుంది.
అప్పుడే ఆ జంటకు పెళ్లి అయ్యింది. ఆ వేడుకకు వచ్చిన వారందరూ కంగ్రాట్స్ చెప్పారు. సాయంత్రం గ్రాండ్‌గా పార్టీ నిర్వహించారు. పెళ్లయ్యాక విదేశాల్లో వధూవరులు డ్యాన్స్ చేయడం ఆనవాయితీ! ముఖ్యంగా.. అబ్బాయిలైతే జోరుగా డ్యాన్స్ చేస్తారు. ఈ ఈవెంట్‌లో కూడా వరుడు అలాగే చెలరేగిపోయాడు. వధువు ఓ కుర్చీలో కూర్చోగా, ఆమె ముందు స్టెప్స్ వేస్తూ భార్యని మెప్పించే ప్రయత్నం చేశాడు భర్త. ఈ నేపథ్యంలోనే ఓ స్టంట్ చేద్దామని ప్రయత్నించాడు. భార్య పై నుంచి కాలు ఎత్తాలనుకున్నాడు. కానీ, అది ఆమె ముఖానికి తగిలింది. దీంతో దబ్‌మని ఆమె కిందకు పడిపోయింది. దెబ్బ కాస్త గట్టిగానే తగలడంతో.. మెదడు దగ్గరున్న నరాలు జివ్వుమన్నాయి. ఆ దెబ్బతో ఆమెకు గిర్రున కళ్లు తిరిగినంత పనైంది.
అయితే, వరుడు వెంటనే తన తప్పు సరిదిద్దుకొని, తన భార్య పూర్తిగా కింద పడిపోవడానికి ముందే లేపాడు. అయ్యో తప్పైపోయింది, డ్యాన్స్ చేయబోతుంటే కాలు తగిలింది, నన్ను క్షమించమనేలా దీనమైన ఫేస్ పెట్టాడు. వేడుక కాబట్టి, ఆ వధువు కూడా ఏమీ అనలేకపోయింది. అదే ఇంట్లో ఇలా జరిగి ఉంటే, మనోడికి బడితపూజే (హీహీ)! ఏదేమైనా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
https://www.youtube.com/shorts/ZKP5IBHK53U