లంచాలు తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ అధికారిణి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారం మేరకు…
ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000…
లంచగొండి అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా లంచాలకు చేతులు చాపుతున్నరు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవలందించాల్సిందిపోయి లంచాలు ఇవ్వాలని పీడిస్తున్నారు. లంచాలు పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. తాజాగా మరో అధికారిని లంచం తీసుకుంటూ దొరికిపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. Also Read:Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా? ఈ సోదాల్లో…
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించనందుకు జపాన్ పర్యాటకుడికి జరిమానా విధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పర్యాటకుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ వెనుక సీటుపై కూర్చున్నాడు. పోలీసులు అతనికి జరిమానా విధించినప్పుడు వీడియో తీశాడు. సాధారణంగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ప్రయాణీకుడు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైరల్ వీడియోలో, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది జపాన్ పర్యాటకుడి నుండి రూ.…
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు..
ఏలూరులో సీబీఐ వలకు చిక్కాడు విజయవాడకు చెందిన ఐటీ ఇన్‌స్పెక్టర్.. ఏలూరులోని ఓ మొబైల్ షాపు యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, సీబీఐ వలవేసి ఆ అధికారిని పట్టుకుంది.. కాగా, ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి..
లంచం తీసుకోవడం నేరం అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కావొచ్చేమో కొందరు ఉద్యోగులు లంచాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు రావడం లేదు. తాజాగా జిహెచ్ఎంసి గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. ఆమెనే అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. Also Read:12 Marriages: నిత్య పెళ్లి కూతురు..!…
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్…
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్లోని నాంపల్లి, గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ క్రమంలో.. మలక్పేట్-II సర్కిల్కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.