Bribe : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండం కు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడి తో పాటు అదనంగా డబ్బులు…
ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు.
ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. మహిళా రైతు నుండి రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా బేగం పట్టుబడింది. చెరుకూరి ప్రమీలా రాణి అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల పేరు మార్పు కోసం రూ.2 .50 లక్షల డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.
మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
లంచం తీసుకుంటూ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. నీటి పారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో పాటు సర్వేయర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కార్తీక్, నికేష్ కుమార్‌తో పాటు సర్వేయర్ గణేష్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.
కష్టపడి చదువుకొని గవర్నమెంట్ కొలువు సంపాదించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి లక్షల్లో జీతం తీసుకుంటూ కూడా కొంతమంది కుక్కతోక వంకర అన్నట్లుగా అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలావనో లేక దొరికింది దోచేయాలన్న ఉద్దేశంతోనో కొంతమంది అధికారులు కనిపించిన చోటల్లా తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది.