లంచం తీసుకోవడం నేరం అని అవగాహన కల్పించాల్సిన అధికారులే లంచాలకు ఆశపడుతున్నారు. లంచగొండి ఉద్యోగులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు. తాజాగా హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
Also Read:Sigma : సందీప్ కిషన్ ‘సిగ్మా’లో కేథరీన్ స్పెషల్ సాంగ్
కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి ఈ లంచం తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇంకా హనుమకొండ కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.