CBI arrests IT Inspector: ఏలూరులో సీబీఐ వలకు చిక్కాడు విజయవాడకు చెందిన ఐటీ ఇన్‌స్పెక్టర్.. ఏలూరులోని ఓ మొబైల్ షాపు యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, సీబీఐ వలవేసి ఆ అధికారిని పట్టుకుంది.. కాగా, ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి.. వాటిని ఏలూరు జిల్లా పరిధికి చెందిన ఇన్స్పెక్టర్ బి.రామచంద్రరావుకు అధికారులు విచారణ నిమిత్తం అందజేశారు.. సెల్ ఫోన్ సర్వీస్ షాపు యజమానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు, విచారణకు ఆయనను పిలవకుండా ఉండేందుకు ఐటీ ఇన్స్పెక్టర్ .5 లక్షలు డిమాండ్ చేశాడు..
Read Also: Delhi: ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఆవేదన వెల్లడి!
అయితే, ఏలూరు జిల్లా పాలగూడేనికి చెందిన రాజు అలియాస్ రాజారత్నం మధ్యవర్తిగా 1.20 లక్షలకు బేరం.. 20 వేలు మధ్యవర్తికి, ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు లక్ష ఒప్పందం జరిగింది.. మధ్యవర్తి వ్యాపారి నుంచి 70 వేలు తీసుకుని ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు ఇస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.. ఐటీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మధ్యవర్తిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుహాజరుపరచగా.. రిమాండ్ విధించారు న్యాయమూర్తి..