లంచం తీసుకోవడం నేరం అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కావొచ్చేమో కొందరు ఉద్యోగులు లంచాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు రావడం లేదు. తాజాగా జిహెచ్ఎంసి గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. ఆమెనే అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా.
Also Read:12 Marriages: నిత్య పెళ్లి కూతురు..! ఇప్పటికే 12 పెళ్లిళ్లు.. ఆమె టార్గెట్ వాళ్లే..
గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బిల్లు ప్రాసెస్ చేసి పైకి పంపించడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసింది గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. రూ. 5 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. మిగతా రూ. 15 ఇచ్చే ముందు ఏసీబీ కి పట్టించారు బాధితులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు ఏసీబీ అధికారులు.