I DONT WANT BRIBE: ప్రభుత్వ కార్యాలయాల్లో, అందునా రెవెన్యూశాఖలో అధికారులు అమ్యామ్యాలు ఎక్కువగా గుంజుతారనేది జనం ఆరోపణ ఎదుర్కింటుంటారు. ఇక ప్రభుత్వ కార్యాలయం పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది లంచమే.. గవర్నమెంట్ ఆఫీసుల్లో అమ్యామ్యాలు సమర్పించుకుంటేనే ఏదైనా పని జరుగుతుందనే టాక్ ఉంది. దీంతో.. అధికారులకు కరెన్సీ ఇవ్వనిదే ఫైల్ కదలదని అంటారు. దీంతో.. అవినీతిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు, ఏసీబీ, విజిలెన్స్, టాస్క్…
ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కెటిదొడ్డి మండలం ఇర్లబండ గ్రామ శివారులో గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణకు 7 ఎకరాల పొలం ఉంది. జీవన ఉపాధి నిమిత్తం అమనగల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే తన భూమి కజ్జాకు గురవుతుందంటూ వెంటనే సర్వే చేయాలని పలుసార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆపై కెటిదొడ్డి మండలానికి చెందిన సర్వేయర్ తిక్కన్నను ఆశ్రయించాడు.…
మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను…
వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ అనినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు.. పీఎన్ఆర్ సీడ్స్ పేరిట మొక్కల వ్యాపారం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని నర్సరీలకు మొక్కలు సరఫరా చేశారు. ఇందుకు బిల్లులు మంజురు చేయాల్సి ఉండగా.. డీఎఫ్వో బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో మొక్కల వ్యాపారి నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. నేడు రూ.3 లక్షల లంచం తీసుకొంటుండగా.. అధికారులు…
లంచాల విషయంలో ఆ ఆఫీసర్ రూటే సెప..రేటు. అన్ని అనుమతులు ఉన్నా.. చేతిలో బరువు పెట్టాల్సిందే. లేదంటే ఎక్కడో ఒకచోట కొర్రీలు పెట్టేస్తారట. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి సైతం ఝలక్ ఇచ్చారట ఆ అవినీతి ఆఫీసర్. ఉద్యోగవర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. అనుమతులున్న వెంచర్లనూ వదలని అధికారులు! హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఎన్నో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లు.. భూములు..…