కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసి-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ లో ఉన్న 18 మందికి ప్రయాణికులుకు కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ లో ఉన్నవారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా కారులో ఉన్నవారు…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని ఆరోపణలు చేస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం అలాంటిది ఏం లేదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలు తేల్చుకునేందుకు గుడివాడకు వెళ్లగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆ ఘటన తరువాత నిజ…
ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు. కడప…
ప్రభుత్వంలో కాపులకు లభిస్తోన్న ప్రాధాన్యత, కాపు సంక్షేమ కార్యక్రమాల పైనా చర్చించేందుకు కాపు నేతలు కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు.. కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. కాన్ఫరెన్సులో ఘంటా, బొండా, వట్టి వసంత కుమార్, మాజీ ఐఏఎస్సులు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల్లోని కాపు ప్రముఖులకూ కారెన్సకు ఆహ్వానం ఇచ్చారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు…
ఏపీలో 11వ పీఆర్సీపై రచ్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేసి రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు…
యంగ్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ తో మొదలైన మ్యూజిక్ ‘ఎన్’ ప్లే ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రెండో ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ సింగర్స్ గీతామాధురి, పర్ణిక మాన్య పాల్గొనడం విశేషం. చిత్రం ఏమంటే… వీళ్ళిద్దరితోనూ ప్రోగ్రామ్ హోస్ట్ సాకేత్ కొమాండూరికి స్పెషల్ ర్యాపో ఉండటంతో ఈ ఎపిసోడ్ కు మరింత ఊపొచ్చింది. అసలు షో ప్రారంభం కావడమే… ముగ్గురూ…
ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు,…
కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత…
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ దాటి అదృశ్యమైన భారతీయ బాలుడి ఆచూకీ లభించిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ) ఆదివారం తెలిపింది. భారత సైన్యంతో కమ్యూనికేషన్లో, చైనీస్ పీఎల్ ఏ తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిందని మరియు సరైన లాంఛనాల తర్వాత తిరిగి పంపబడుతుందని పేర్కొంది. భారత సైన్యం చైనీస్ వాదనను ధృవీకరిస్తోంది మరియు తప్పిపోయినట్లు నివేదించబడిన బాలుడు ఒకడేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిపోయిన బాలుడిని మిరామ్ టారోన్గా గుర్తించి, ఏర్పాటు…