సంప్రదింపులకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో 11వ పీఆర్సీపై రచ్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేసి రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీపర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్ ఉన్నందున మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?