గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు.
గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు, పేకాట అన్నీ చట్ట వ్యతిరేకమే.. కోడిపందాలు మా సంస్కృతి అని సుప్రీంకోర్టుకి వెళ్లిన వారు మీవైపే ఉన్నారు కదా అని అయన ప్రశ్నించారు. మాగంటి బాబు, యరపతినేనిలు ఏడాది పొడవునా పేకాటలు ఆడించింది నిజం కాదా?? కల్చర్ గురించి గగ్గోలు పెట్టే టిడిపి నేతలు రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్స్ ల గురించి ఏం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. రామోజీ రావు కూడా గుడివాడ దగ్గరే పుట్టారని, 365 రోజులూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న బెల్లీ డ్యాన్స్ లు టీడీపీకి కనిపించడం లేదా అంటూ ఆయన విమర్శించారు. ఆ మూడు రోజులు కొడాలి నాని కరోనా తో ఏఐజీలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.