కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసి-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ లో ఉన్న 18 మందికి ప్రయాణికులుకు కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ లో ఉన్నవారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా కారులో ఉన్నవారు ములుగు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం పోయివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.