నేటి సమాజంలో చిన్నాపెద్ద తేడాలేకుండా.. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన.. ఎంత భయంకరంగా శిక్షించినా కామాంధులు మారడం లేదు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులను సైతం కామాంధులు విడిచిపెట్టడం లేదు.. మృగాళ్లు చిన్నారులపై పడి విచక్షణ రహితంగా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. సమాజంలో ఆడపిల్లల బతుకు ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో ఓ వివాహితుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని ఏలూరులో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని పాములదిబ్బకు చెందిన వివాహితుడు వెంకయ్య ప్రేమించాలి అంటూ గత కొద్దీ రోజుల నుంచి వేధింపులకు గురిచేశాడు. అయితే వేధింపులు తీవ్రం కావడంతో బాధిత బాలిక కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.