ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. భారత్‌లోనూ కరోనా భయపెడుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా పేరు వింటేనే వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన కరోనా గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టింది.
చైనాతో పాటు పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Booster Dose: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్‌కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్‌రావు…
కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్, సెకండ్ డోస్ వేయించుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఫస్ట్, సెకండ్ డోస్‌లతో పోలిస్తే.. బూస్టర్ డోస్ కు స్పందన పెద్దగా లేదనే వాదన కూడా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం.. ఇంటి వద్దరే వెళ్లి బూస్టర్ డోస్ వేసేలా ప్లాన్ చేస్తోంది.. కోవిడ్ ఫస్ట్, సెకండ్ డోసుల పంపిణీలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంది సర్కార్.. ఇంటి వద్దకు వెళ్లి.. పొలాల్లోకి వెళ్లికూడా…
Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందులకు గురవుతోంది. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఇక ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇవి వివిధ వేరియంట్లపై ఎలా పనిచేస్తాయి..ఎంతకాలం రక్షణ ఇస్తాయనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్…
దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల…