కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం…
కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తర్వాత ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వేసుకుని బూస్టర్ డోస్ కోసం వేచిచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. కోవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించింది ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క రెండో డోస్.. బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ 9 నెలలుగా ఉండగా.. దానిని…
మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.. దానికి వ్యాక్సినేషన్‌తోనే చెక్ పెట్టాలని అనేక పరిశోధనలు తేల్చాయి.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. భారత్‌లోనూ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. కొన్ని దేశాల్లో మందకొడిగానే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లో పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. కరోనా వేవ్‌లు, బూస్టర్ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. 4-6 నెలలకు ఒక…
దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్సు వారికి బూస్టర్ ఇవ్వడంలో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పేరుకుపోయినప్పటికీ 18+కు బూస్టర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలిపోయిన 32 లక్షల డోసులను ప్రభుత్వం ఆధ్వర్యంలో 18-59 ఏండ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ వేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ను…
దేశంలో కార్బెవాక్స్ హెటిరోలాజస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) బూస్టర్ డోస్ అనుమతి ఇచ్చింది. దేశంలో తొలిసారిగా బూస్టర్ డోస్ అనుమతి పొందిన హెటెరోలాజస్ డ్రగ్ గా కార్బెవాక్స్ నిలిచింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ మేకర్ బయోలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన అంతకన్నా ఎక్కువ వయసు గల వ్యక్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రెండు…
చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసుల పరిధిని పెంచాలని ఆరోగ్యశాఖ…
యూఎస్‌లో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సిన్, మూడో డోసు కింద బూస్టర్ డోస్ లను అందిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేవ్‌ల సమయంలో యూఎస్‌లో కేసులు భారీగా నమోదయ్యాయి. కేసులతో పాటు పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ కేసులు పెరగడం, వ్యాక్సిన్‌లను తట్టుకొని వైరస్ మహమ్మారి దాడులు చేస్తుండటంతో నాలుగో డోస్ కింద మరోసారి బూస్టర్ డోసులు ఇచ్చేందుకు యూఎస్ రంగం సిద్దం చేసుకుంటోంది. దీనిపై అంటువ్యాధుల…
తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. అయితే, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతదూరం వెళ్లి క్యూలైన్లో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలంటే అయ్యేపనికాదు. వీరికోసం జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు…
కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న రక్షణ కావడంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయించారు. చాలా దేశాల్లో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసుల అందిస్తున్నారు. బూస్టర్ డోసులు తీసుకున్నవారిలో యాంటిబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివర్శిటి వైద్య విభాగం కీలక పరిశోధన చేసింది. ఫైజర్ టీకాను తీసుకున్నవారి…