కరోనా ప్రస్తుత పరిస్థితితో మరోసారి ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా తమ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే కొన్ని ఆంక్షలను తప్పనిసరి చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న వారినే అబుదాబిలోకి అనుమతిస్తామని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పరిగణించనున్నట్టు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్రంలో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే అన్నారు.. సుమారు…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా,…
కరోనా మహమ్మారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. యూరప్, అమెరికా దేశాలను ఒమిక్రాన్ డామినెట్ చేయడంతో అక్కడ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలో రోజుకు 11 నుంచి 13 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అక్కడి చాలా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రోజుకు లక్ష మందికిపైగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలోనే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగానే కేసులు పెరుగుతున్నాయి. అయితే, డెల్టా కంటె ప్రమాదకరం కాదని నిపుణులు…
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రికాషనరీ డోస్ కింద వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, మూడో డోస్ కింద అదే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. మొదటగా 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 5.75 కోట్ల మంది మూడో డోస్ వ్యాక్సిన్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇందులో 2.75 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన…
కరోనా బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో… బూస్టర్ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్ అండ్ మ్యాచ్ వద్దని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. మూడో డోసుల విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు 2లక్షలకు చేరువలో వున్నాయి.…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. Read Also:…
కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్న వేళ భారత్ బయోటెక్ ఫార్మా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా వారిలో డెల్టాను నిలువరించే యాంటాబాడీలు ఐదురెట్టు వృద్ధి చెందుతాయని భారత్ బయోటెక్ తెలియజేసింది. అంతేకాదు, బూస్టర్ డోస్ తీవ్రమైన వైరస్‌ను 90శాతం కట్టడి చేస్తుందని పేర్కొన్నది. బూస్టర్ డోసులు తీసుకున్నావారిలో టి, బి సెల్స్‌ను గుర్తించామని తెలియజేసింది. Read: బెంగళూరులో 10శాతం…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, థర్డ్ వేవ్ ముప్పు పొంచియున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, బూస్టర్ డోసులుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వబోతున్నారు అన్నదానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో డోస్ ఉంటుందా లేదంటే గతంలో ఇచ్చిన కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రికాషన్ డోస్‌గా ఇస్తారా…