Corona Virus: దేశంలో కరోనా రెండో బూస్టర్ డోస్ అవసరమా?.. సర్కారు ఏమందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Virus: చైనాతో పాటు పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తోంది.
Rishabh Pant: అక్కడ గుంతలేమీ లేవు.. సీఎంకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్
Also Read
- Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
- Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
- Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
అయితే ప్రపంచ దేశాల్లో వ్యాప్తి దృష్ట్యా రెండో బూస్టర్‌పై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోస్ అవసరం లేదని పేర్కొన్నాయి. మొదటగా దేశంలో ఇప్పటికే ప్రారంభించిన బూస్టర్ డోస్ డ్రైవర్‌ను పూర్తి చేయాలని తెలిపాయి. ఇప్పటి వరకు మన దేశంలో 220.11 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
మంగళవారం తాజా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో ఇవాళ 134 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 2,582 కి తగ్గాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,78,956) నమోదైంది. ఈ రోజు వరకు కోవిడ్ బారినపడి మృతిచెందిన మొత్తం మృతుల సంఖ్య 5,30,707గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నమోదు కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.13 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,45,667 కు పెరిగింది. కరోనా సోకిన వారిలో 1.19 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!