మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాను తలపించేలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమానాలు రాకుండా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలలోని 38 మందితో పాటు 8 మంది స్వతంత్రులు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. గుజరాత్ సూరత్ నుంచి అస్సాం గౌహతికి రెబెల్ నేతలు క్యాంప్ మార్చారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ మహావికాస్ అఘాడీ…
విప్లవ కవి వరవరరావుని మెడికల్ పరీక్షల కోసం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని ఎన్ఐఏను ఆదేశించింది బాంబే హైకోర్టు. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులను ఎన్ఐఏ భరించాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. వరవరరావుకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని గతంలోనే బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చింది బాంబే హైకోర్టు. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష…
అశ్లీల చిత్రాలను రూపొందించడం ఇబ్బందులను కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ కష్టాలు పెరుగుతున్నాయి. పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా తిరస్కరించింది. తన నిర్మాణ సంస్థ రూపొందించిన వీడియోలు ‘శృంగారభరితమైనవి’ మాత్రమేనని, అయితే వాటిని పోర్న్‌గా పరిగణించరాదని రాజ్ కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు. రాజ్ కుంద్రాతో పాటు నటి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా సహా మొత్తం…
లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే…
విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్న వరవరరావుకు…
డిజిటల్ మీడియాకు భారీ ఊరట కలిగించింది బాంబే హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.. ఆన్‌లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి పాటించాల్సిందేనని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే కాగా… ఈ నిబంధనలపై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు సీజే…
జార్ఖండ్ జెసూట్ ఫాదర్, ఆదివాసుల అభ్యున్నతికి అంకితమైన హక్కుల కార్యకర్త,స్టాన్‌స్వామి నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేస్తున్నది.82 ఏళ్ల ఈ వయోవృద్ధ సంఘ సేవకుడు గత అక్టోబర్8న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్‌ఐఎ) భీమ్ కొరగావ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి అనేక బాధలుపడుతూనే బెయిలు కోసం పోరాడుతూ వచ్చారు.పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌స్వామికి కరోనా కూడా సోకింది.ఎట్టకేలకు మే28న ముంబాయిహైకోర్టు ఆయన బెయిల్ పిటిషిన్‌ను స్వీకరించింది. కాని బెయిల్ ఇవ్వడం గాక చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా…
తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసులో బాంబే హైకోర్టు షాకిచ్చింది… కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆమెకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.. కాగా, తెలుగు సినిమాల్లోనూ నటించిన నవనీత్ కౌర్ అందరికీ సుపరిచితురాలు.. 35 ఏళ్ల ఈ యువ ఎంపీ.. ఏకంగా ఏడు…
వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది.. 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. అయితే, వయో వృద్ధులు, వికలాంగులకు, వీల్‌చైర్‌కే పరిమితం అయినవారికి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని బాంబే హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది.. అయితే, వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్రం.. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తే తలెత్తే సమస్యలపై వివరాలను హైకోర్టుకు అందజేసింది.. కాగా, ధృతి కపాడియా, కునాల్ తివారీలు…