వరవరరావుకి వైద్యపరీక్షలు..బాంబే హైకోర్ట్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విప్లవ కవి వరవరరావుని మెడికల్ పరీక్షల కోసం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని ఎన్ఐఏను ఆదేశించింది బాంబే హైకోర్టు. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులను ఎన్ఐఏ భరించాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. వరవరరావుకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని గతంలోనే బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చింది బాంబే హైకోర్టు.
భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. కేసు, ఆ నిర్బంధం మూడు సంవత్సరాలుగా కొనసా……గుతూనే ఉన్నది. గత ఎనిమిది నెలలుగా ఆరోగ్య కారణాలపై షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మినహాయింపు. కాని ఈ మధ్యంతర బెయిల్ షరతులు ఆయన నిర్బంధాన్ని పూర్తిగా తొలగించలేదు. ఈ ముప్పై ఆరు నెలలలో ఆయన పదిహేను నెలలు పూణేలోని యరవాడ జైలులో, ఎనిమిది నెలలు నవీ ముంబాయిలోని తలోజా జైలులో, నాలుగు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో ముంబాయి లోని ఆస్పత్రులలో, ఎనిమిది నెలలు గృహనిర్బంధం లాంటి మధ్యంతర బెయిల్ పై గడిపారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను రెండుసార్లు పొడిగించింది. వరవరరావుకి ఈనెల 13న అపెండిక్స్ ఆపరేషన్ అయింది. లాపరోస్కోపిక్ సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే ఎన్ఐఏ ఆయన ఆరోగ్యం బాగానే వుందని వాదించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ మీరే నానావతి ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఆరోగ్య కారణాల మీద వరవరరావుకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ పొడిగించాలని వేసిన పిటిషన్ పై ఇవాళ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో, ఆయనను నానావతి ఆస్పత్రికి తీసుకువెళ్లి, పరీక్షలు చేయించాలంది. ప్రస్తుత ఆరోగ్య స్థితి మీద నివేదిక తయారు చేయించి కోర్టుకు ఇచ్చే బాధ్యతను ఎన్ ఐ ఎ కు అప్పగించింది. మరుసటి వాయిదా డిసెంబర్ 3 మధ్యాహ్నం 2.30 కు వేసింది. వరవరావు జైలుకు తిరిగి వెళ్లడానికి గడువు డిసెంబర్ 6 గా నిర్దేశించింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!