రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ పెరుగుతున్న కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అశ్లీల చిత్రాలను రూపొందించడం ఇబ్బందులను కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ కష్టాలు పెరుగుతున్నాయి. పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా తిరస్కరించింది. తన నిర్మాణ సంస్థ రూపొందించిన వీడియోలు ‘శృంగారభరితమైనవి’ మాత్రమేనని, అయితే వాటిని పోర్న్‌గా పరిగణించరాదని రాజ్ కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు. రాజ్ కుంద్రాతో పాటు నటి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా సహా మొత్తం 6 మంది ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Read Also : టాప్ యాంగిల్ సెల్ఫీతో టాప్ లేపిన ‘రత్తాలు’
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
రాజ్ కుంద్రా ఇంతకు ముందు ఈ ఏడాది జూలైలో పోర్న్ ఫిల్మ్ కేసులో అరెస్టయ్యాడు. దీనిని ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారించింది. ఈ విషయమై బాంబే హైకోర్టుకు రాజ్ కుంద్రా సమాధానమిస్తూ.. వీడియోలు శృంగారభరితంగా ఉంటాయి కానీ లైంగిక కార్యకలాపాలను చూపించవని అన్నారు. ముంబై పోలీసుల సైబర్ సెల్‌లో నమోదైన పోర్న్ రాకెట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా… ఐటీ చట్టంలోని సెక్షన్లు 67, 67(ఏ) భారతదేశంలో వర్తించవని కోర్టుకు తెలిపారు. రాజ్ కుంద్రా తరఫు న్యాయవాదులు అది ప్రశాంత్ పి పాటిల్, స్వప్నిల్ అంబురేలు కోర్టులో సమర్పించిన పత్రాల్లో వ్యాపారవేత్తపై ఉన్న ఏకైక అభియోగం కేసులో సహ నిందితులుగా ఉన్న నటీనటులు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేల వ్యక్తిగత వీడియోలకు సంబంధించినది అని పేర్కొన్నారు. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలకు కంపెనీ యాప్‌ను మాత్రమే అందించిందని, అయితే ఇద్దరు నటీమణులకు ఆ వ్యక్తిగత ఓటిటి యాప్‌లో ప్రసారం, పంపిణీపై పూర్తి నియంత్రణ ఉందని రాజ్ న్యాయవాది చెప్పారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌డబ్ల్యూ సాంబ్రే చట్టపరమైన చర్యలను నివారించడానికి లేదా అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఈ నిందితులందరికీ మధ్యంతర రక్షణను 4 వారాల పాటు పొడిగించారు. ఈ కేసులో ఆయనకు సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది.
Read Also : దూకుడుగా ఉన్న “లైగర్”… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు
‘హాట్‌షాట్స్’ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి అశ్లీల చిత్రాలను నిర్మించి పంపిణీ చేసినందుకు రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ జూలై 19న అరెస్టు చేసింది. కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420 (చీటింగ్), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల ప్రకటనలు, ప్రదర్శనలకు సంబంధించినది) ఐటి చట్టంతో పాటు మహిళల అసభ్య ప్రాతినిధ్యం కింద కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయడంతో సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ మంజూరైంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!