నవనీత్ కౌర్‌కు హైకోర్టు షాక్.. రూ.2 లక్షల జరిమానా కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసులో బాంబే హైకోర్టు షాకిచ్చింది… కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆమెకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.. కాగా, తెలుగు సినిమాల్లోనూ నటించిన నవనీత్ కౌర్ అందరికీ సుపరిచితురాలు.. 35 ఏళ్ల ఈ యువ ఎంపీ.. ఏకంగా ఏడు బాషలు మాట్లాడగలరు.. ఇక, మార్చిలో ఆమె చేసిన కామెంట్లు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్‌సభ లాబీలో బెదిరించారని ఆరోపించారు.. మహారాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తనకు జైలు తప్పదని వ్యాఖ్యానించారని మీడియాకు వెళ్లడించారు.. అంతేకాదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సైతం ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. తనను ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. తనపై యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మరోవైపు.. నవనీత్ కౌర్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అడ్సల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె విజయం సాధించిన అమరావతి లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వు కాగా.. ఫేక్ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, ఈ స్థానం నుంచి పోటీ చేశారని కోర్టును ఆశ్రయించారు.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు నిర్ధారించింది.. దానిని రద్దు చేస్తూ, రూ.2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. మరో 6 వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.. ఈ పరిణామాలతో నవనీత్ కౌర్ ఎంపీ పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.. అయితే, పదవి విషయంపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!