మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కొవిడ్ 19 కేసులు ఎక్కువ ఉండటం, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తెలిపారు. అయితే మార్చి…
ప్రస్తుతం స్టార్లందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి , బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా వెంకీ మామ సైతం బాలీవుడ్ బాట పట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు వెంకీ మామ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అది…
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ…
గానకోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన స్నాగతి తెలిసిందే. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. అయితే లతాజీ అంత్యక్రియల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన పని ప్రశంసలను, విమర్శలను కూడా అందుకొంటుంది. లతాజీ భౌతికకాయం వద్ద షారుక్ ఉమ్మి వేసి ప్రార్థన చేసి నివాళులు అర్పించారు. దీంతో పలువురు హిందువులు దీన్ని తప్పు పట్టారు. మరికొందరు షారుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆయన తనదైన పద్దతిలో…
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలనాటి ‘బడే మియా చోటే మియా’లో అమితాబ్, గోవింద ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. డేవిడ్…
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…
‘మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్’ వంటి సినిమాలు తీశారు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వాలిమై’ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 24న విడుదల కాబోతోంది. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా నిర్మించారు. విశేషం ఏమంటే… మార్చి 9వ తేదీ అజిత్ తో ముచ్చటగా మూడో…