బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ ని 1998 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2017 లో విభేదాల వలన భర్త నుంచి విడిపోయింది. ఇక ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని ఏ బ్యూటీ మొదటిసారి విడాకులపై నోరువిప్పింది. ఇటీవల మలైకా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు భయం వేసింది.. సింగిల్ మదర్ గా నా కొడుకును నేను సరిగ్గా పెంచగలనా.. లేదా అని చాలాసార్లు ఆలోచించాను.
తల్లిగా నీ బాధ్యతని ఎలా నిర్వహించబోతున్నావని ప్రపంచం మొత్తం నన్ను అడుగుతున్నట్లు అనిపించింది. అది ఏ మనిషిలోనైనా కలిగే భావనే. విడాకుల తర్వాత ఈ ఆలోచనలన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా దైర్యంగా ముందడుగేశాను.. అప్పుడు కంటే ఇప్పుడే నా కొడుకుకు నా అవసరం ఉంది.. అతడు సొంతంగా చేసిన తప్పులను తనంతట తానే తెలుసుకునేలా చేయాలి. ఎందుకంటె ఇప్పుడే తను ఎదుగుతున్నాడు. ప్రస్తుతం నేను సింగిల్ మదర్ ని.. అదే నన్ను ఇంకా బాధ్యతగా ఉండేలా చేస్తోంది.. కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.