Alia Bhatt: మహేష్ కోసం మరోసారి ఆ భామకే ఓటేసిన జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అలియా భట్ ఛాన్స్ అందుకుంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో అలియా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందన్న సంగతి తెలిసిందే..
ఇక తాజగా మరో బిగ్గెస్ట్ ఆఫర్ ని అమ్మడు పట్టేసిందంట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి.. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెల్సిందే. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దుర్గారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన అలియాను సెట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే అలియా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఒక్క అలియానే కాకుండా పాన్ ఇండియా నటుల్ని సినిమాలో భాగం చేయాలని టీమ్ భావిస్తోందిట.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!