బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ జంట ఒకటి. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్ గా నిలిచి.. మంచి భార్యకు అర్ధం చెప్పింది. ఇక ఇలా ఉన్నా గౌరీ ఒకానొక సమయంలో షారుఖ్ ని వదిలేద్దామనుకున్నదట. ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమె, తన లవ్ స్టోరీ ని రివీల్ చేసింది.
” తాము పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అది నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. కాబట్టే నేను కొద్దిగా సమయం తీసుకుంటానని చెప్పాను. కానీ షారుఖ్ వినలేదు.. నన్ను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం అతనిని మ్యానేజ్ చేయలేకపోయాను.. ఎందుకంటే అతనికి పోసిసివ్ నెస్ ఎక్కువ .. దీంతో నేను నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ కావాలని అడిగి తన నుంచి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఆలోచించించుకొని తన దగ్గరకు వెళ్లాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. అప్పట్లో షారుఖ్- గౌరీ ల ఫోటోలను వెతికి పట్టుకొని మరి షారుఖ్ ఫ్యాన్స్ ఈ వార్తను వైరల్ గా మారుస్తున్నారు. ఇక షారుఖ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.