రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి ఎలా ఒప్పుకుంది అని రకుల్ ఫై ట్రోలింగ్ మొదలయ్యింది. ఈ ట్రోలింగ్ పై రకుల్ స్పందించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ” ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి.. కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా మారిన ఓ అమ్మాయి కథ. ఇందులో మేము చూపించకూడనిది ఏది చూపించలేదు. సమాజంలో జరిగేదే చూపించాం.. మొదట ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడు నా తల్లిదండ్రులకు చెప్పాను. వారు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్‌ని చేయాలని నిర్ణయించుకున్నా .. అందులోను నా పేరెంట్స్ ఒప్పుకున్నారు.. నేను చేసే ప్రతి సినిమా నా పేరెంట్స్ అంగీకారంతోనే చేస్తాను. ఎందుకంటే నా మొదటి ప్రేక్షకులు వారే కాబట్టి” అని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో బాలీవుడ్ లో అమ్మడు హిట్ అందుకుంటుందో.. లేదో చూడాలి.