సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.. ఇక హీరోయిన్ల విషయంలో గ్లామర్ మాత్రమే ముఖ్యం.. నడుము సన్నగా ఉండాలి.. వెనక భాగం ఎత్తుగా ఉండాలి అని కొలతలు కొలిచేస్తుంటారు.వారిలో ఏ కొద్దీ మార్పు వచ్చినా ఇండస్ట్రీకి పనికిరావు అని పక్కన పడేస్తారు. దీంతో.. హీరోయిన్లందరూ గ్లామర్ పెంచుకోవడానికి సర్జరీలను నమ్ముకుంటున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అయిదు ఈ ముద్దుగుమ్మ కూడా తన అందానికి సర్జరీలతో మెరుగులు దిద్దింది. ఇక ఈ విషయాన్ని అమ్మడు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
” నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.. ఈ రంగంలో స్థిరపడడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. నా 15- 16 ఏళ్ల వయస్సులో నన్ను చూసినవారు.. హీరోయిన్ అవ్వాలంటే బాడీ షేప్ ఉండాలి.. ఫేస్ గ్లామర్ గా ఉండాలి.. అప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి అని చెప్పుకొచ్చారు. దీంతో నా బ్రెస్ట్ షేప్ కోసం నేను బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నాను.. అది చాలా భయంకరమైన అనుభవం.. ఒక సెలబ్రిటీగా ఎంతో మంది అభిమానులను సంపాదించడం అంత సులువైన విషయం కాదని” రాఖీ చెప్పుకొచ్చింది. కాగా రాఖీ బ్రెస్ట్ ఇంప్లాంట్‌తో పాటు లైపో సెక్షన్ కూడా చేయించుకుంది.