బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది. క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ…
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.…
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటుంది. సక్సెస్ అయ్యాకా చాలామంది వాటి గురించి మాట్లాడరు.. మరికొంతమంది ఆ చేదు అనుభవాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ” ఏ నటికైనా ఒక సీరియల్ కానీ, షో కానీ అయిపోయాక…
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాతో విడిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది సుస్మితా ‘ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది’ అంటూ అధికారికంగా బ్రేకప్ ప్రకటించింది. అప్పటి నుంచి సింగిల్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరోసారి కలిసి వార్తల్లో నిలిచారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంట కూడా…
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడటం బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు చేతకాదు. ఏ విషయం గురించైనా తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తోంది. చిత్రం ఏమంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు… ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రావర్సీ లోకి లాగడం ఉత్తరాది మీడియాకు అలవాటుగా మారింది. అలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది. హృతిక్ రోషన్…
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ “దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు” అంటూ నోరు జారింది. ఇక దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా ఖండించిన విషయం తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అమ్మడి పేరు సోషల్ మీడియాలో…
సౌత్ ఇండియాలో కాస్తంత బొద్దుగా ఉండే హీరోయిన్లను జనం ఇష్టపడతారు కానీ బాలీవుడ్ లో అలా కుదరదు! సన్నగా నాజూకుగా ఉండాలి హీరోయిన్ అంటే!! అంతేకాదు… సైజ్ జీరో అయినా వాళ్ళకు ఓకేనే! అయితే… తమ ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ భామలు చాలా కసరత్తులే చేస్తుంటారు. యోగాతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సైజ్ కంట్రోల్ కు కారణమౌతుంది. ఇంతకూ బాలీవుడ్ బ్యూటీస్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏమిటో తెలుసుకోవాలని మీకుందా!? అయితే ఆలస్యమెందుకు… తెలుసుకుంటే…
1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని…