సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు. ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల…
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమందు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్టేడియం లో నగ్నంగా తిరుగుతాను అని సంచలన ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన అమ్మడు నిత్యం ఏదో ఒక వివాదంతో నెటిజన్ల నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భర్త వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి విడిపోయిన…
బాలీవుడ్ లో ఈ యేడాది ప్రారంభంలోనే వెడ్డింగ్ బెల్స్ మ్రోగడం మొదలైంది. వరుసగా వెండితెర, బుల్లితెర భామలు పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూథీ, నాగిన్, బాల్ వీర్’ వంటి సీరియల్స్ తో పాటు ‘బిగ్ బాస్ సీజన్ 8’ లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది కరిష్మా తన్నా సైతం పెళ్ళికూతురైపోయింది. ‘నాచ్ బలియే 7, ఝలక్ దిఖ్ లా 9, ఖత్రోంకీ ఖిలాడీ 10’ సీజన్స్ లో పాల్గొన్న కరిష్మా…
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన…
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో…
‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన…
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి…