హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? అధికార TRSని ఢీకొట్టడం సాధ్యమా..? ఈటలను కాదని కాంగ్రెస్ పైచెయ్యి సాధించడం ఈజీయేనా? కొండా… కాంగ్రెస్‌కి కొండంత అండ ఇవ్వగలరా? కొండా సురేఖ అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓటు చెదిరిపోదని లెక్కలు..! హుజురాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కి సవాల్. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తక్కువ. గెలవలేనప్పుడు గౌరవప్రదమైన ఓటు బ్యాంకైనా సాధించి తీరాలి. పైగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌తోపాటు…
బద్వేల్ ఉప ఎన్నిక పోటీపై సోమువీర్రాజు క్లారిటీ ఇచ్చారు. బద్వేల్ ఉపఎన్నికకు సంబంధించి తమ మిత్రపక్షమైన జనసేన తో చర్చిస్తామని…. చర్చలు అనంతరం బద్వేల్ అభ్యర్థి ఎవరు అన్నేది ప్రకటిస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు. మత్స్య కార్మికులకు వైసీపీ సర్కార్ ఆర్థిక తోర్పాటు ఇవ్వాలని… మత్స్య కారుల సంఘాన్ని సంప్రదించకుండా వివాదాస్పద జీవో ని తీసుకుని రావాలని చూస్తోందని మండిపడ్డారు. ఏ జిల్లా లో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెడతారో అక్కడే బీజేపీ ఉద్యమం మొదలు…
కరీంనగర్ : కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈటల రాజేందర్ లేఖ రాశారంటూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను తొందరగా విడుదల చేసి, దళిత బంధును, రైతు బంధును ఆపేయాలని ఈటల పేర్కొన్నట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పారామిలటరీ బలగాలతో ఉపఎన్నిక జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ను ఈటల రాజేందర్ కోరినట్లుగా ఆ…
బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా…
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యం లో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.…
బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఇది సన్నాసి…
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని…బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్పం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో తమ స్ట్రాటజీ లు తమకు ఉన్నాయని చెప్పుకొచ్చారు.. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా…హుజురాబాద్‌లో గెలిచేది బీజేపీ నేనని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ కి డిపాజిట్ కూడా రాదు… అభ్యర్థి లేక పక్క జిల్లాల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దవా చేశారు. హుజూరాబాద్ లో పథకాలు అన్ని ఈటెల రాజేందర్…
తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు…
ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 1 న హుజురాబాద్ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక…